News March 10, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురికి నిరాశే.!

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కూటమి నేతలకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదురుచూపులు ఫలించలేదు. పదవి తప్ప కుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మడి జిల్లాలో ఒక రెండు ఎమ్మెల్సీలు లభిస్తాయని అంతా ఊహించినా లెక్కతప్పింది. అధిష్ఠానం ఒక్కటీ కేటాయించలేదు. దీంతో నిరాశ చెందారు.

Similar News

News April 14, 2026

సిరిసిల్ల : రేషన్ కార్డుల్లో అనర్హుల ఏరివేత..!

image

రేషన్ కార్డుల్లో అనుమానితులను ఏరీవేసే ప్రక్రియను ప్రభుత్వం మరోసారి చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి రెండో విడతగా జిల్లాలో అనర్హులను గుర్తించి అనుమానిత జాబితాను పంపించింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. జిల్లాలో 6582 అనుమానిత రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగం, రూ8.లక్షలు ఆదాయం మించి ఉంటే రేషన్ కార్డ్ కట్ చేస్తున్నారు.

News April 14, 2026

HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

image

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.

News April 14, 2026

సంగారెడ్డి: TGRJC ప్రవేశాలు.. రేపే చివరి తేదీ

image

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి బుధవారంతో గడువు ముగియనుందని మునిపల్లి మండలం లింగంపల్లి కళాశాల ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgrjc.cgg.gov.in ద్వారా రూ. 200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.