News December 14, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్‌లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్‌లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.

Similar News

News December 18, 2025

NRPT: స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు ఎటువైపు..!

image

మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు ఏపార్టీ లోకి వెళ్తారో అని ఆయా గ్రామల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. NRPT జిల్లాలో 272 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 35 కి పైగా అభ్యర్థులు స్వతంత్రులు సర్పంచులుగా గెలిచారు. వీరందరూ రానున్న రోజుల్లో ఏ పార్టీలో చేరుతారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలోకి మారే అవకాశాలు ఉంటాయంటున్నారు.

News December 18, 2025

తూ.గో జిల్లాకు నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19వ తేదీన తూ.గో జిల్లాలో పర్యటించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 8.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని 5.45కి విజయవాడకు బయలుదేరుతారన్నారు. ఆయన పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

News December 18, 2025

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.