News August 31, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్లతో మంత్రి కొల్లు టెలీకాన్ఫరెన్స్

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కలెక్టర్లతో మంత్రి కొల్లు రవీంద్ర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 29, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం
☞ తోట్లవల్లూరులో వృద్ధ దంపతులపై హిజ్రాల దాడి
☞ కృష్ణా: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ
☞ కృష్ణాలో వర్క్ ఫ్రం హోం కోసం సర్వే
☞ కృష్ణా: DSC డీఎస్సీ 95% అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి
☞ విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రేమికులు
News August 29, 2025
కృష్ణా: డప్పు కళాకారుల భవిష్యత్తు ప్రశ్నార్థకం?

కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఈ ఏడాది గణేష్ నవరాత్రుల నిమజ్జనానికి డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేసింది. డీజేలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత సాంప్రదాయ వాద్యకారులైన డప్పు కళాకారులు క్రమంగా కనుమరుగైపోతున్నారు. ఒకప్పుడు వీరు బృందాలుగా తమ కళను ప్రదర్శిస్తే అక్కడి నుంచి ఒక్కరు కదలని స్థితి ఉండేది. ఈ ఏడాది డీజేలకు నిషేధం విధించిన నేపథ్యంలో, మళ్లీ ఈ సాంప్రదాయ కళాకారులకు అవకాశాలు వస్తాయా?.
News August 28, 2025
కృష్ణా: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో GST అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో వస్తు సేవల పన్నుకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఆడిట్ పేరాల వివరాలను సంబంధిత ఆడిటర్ అధికారి వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు.