News February 8, 2026

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా మైసూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం ఉమ్మడి కృష్ణా మీదుగా CCT(కాకినాడ టౌన్)- మైసూరు(MYS) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07033 CCT- MYS రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, శుక్రవారం, నం.07034 MYS- CCT రైలు మార్చి 3 నుంచి 31 వరకు ప్రతి మంగళ, శనివారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News February 12, 2026

విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

స్త్రీలకు విటమిన్ C ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇది స‌రిగ్గా ల‌భించ‌క‌పోతే స్త్రీల‌కు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్ప‌త్తి పెరిగి వృద్ధాప్య ఛాయ‌లు తగ్గుతాయి, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే శిశువులో పుట్టుకలోపాలు రాకుండా ఉంటాయి, ఈస్ట్రోజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల హార్మోన్ స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు ఉండ‌వు. కాబట్టి ఇది తగినంత అందేలా చూసుకోవాలంటున్నారు.

News February 12, 2026

చేతులు, కాళ్లు కట్టేసి.. బంగ్లాలో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని మౌల్విబజార్‌లోని చంపా ప్రాంతంలో టీ తోటల్లో పని చేసే రతన్ సహువాకర్‌(28)గా గుర్తించారు. రతన్ చేతులు, కాళ్లు కట్టేశారని, శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న డెడ్‌ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో హత్య జరిగిందా, ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News February 12, 2026

గుంటూరు: మరో గ్యాంగ్ వార్..!

image

వడ్లమూడిలో <<19115553>>విద్యార్థిపై దాడి <<>>జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఐనవోలు సమీపంలోని ఓ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. పాత కక్షలతో చంద్రమౌళి అనే విద్యార్థిని నాగేంద్ర, కౌశిక్ వెంబడించి విజయవాడలో కొట్టారు. పోలీసులు వారించినా తగ్గకుండా, సాయంత్రం సీడ్ యాక్సిస్ రోడ్డుపై చంద్రమౌళిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.