News January 15, 2026
ఉమ్మడి ఖమ్మంలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1. ఖమ్మం కార్పొరేషన్- ST 1, SC 7, BC 20, UR(అన్‌రిజర్వుడ్) 30
2.కొత్తగూడెం కార్పొరేషన్- ST 11, SC 12, BC 7, UR 30
3.ఏదులాపురం- ST 3, SC 7, BC 6, UR 16
4.కల్లూరు- ST 3, SC 5, BC 2, UR 10
5.మధిర- ST 1 , SC 6, BC 4, UR 11
6.సత్తుపల్లి- ST 1, SC 3, BC 7, UR 12
7.వైరా- ST 1, SC 5, BC 4, UR 10
8.అశ్వారావుపేట- ST 3, SC 4, BC 4, UR 11
9.ఇల్లందు ST 2, SC 4, BC 6, UR 12.
Similar News
News February 5, 2026
పెద్దపల్లి: పుష్కరాలకు పక్కా ప్లాన్‌తో ఏర్పాట్లు: కలెక్టర్

రాబోయే గోదావరి పుష్కరాల కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మంథని వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు స్నాన ఘాట్లు, దర్శన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీని తట్టుకునేలా వసతులు కల్పించాలని సూచించారు.
News February 5, 2026
వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2026
ఖర్జూరంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్.. కారణమిదే!

* ఖర్జూరాలను బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
* ఎక్కువ సమయం ఆకలి వేయదు.
* ఒకటి/రెండు తినే సరికి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆకలి తక్కువ వేస్తుంది.
* ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ల కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
* తక్కువ క్యాలరీలు తీసుకోవడంతో హెల్తీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.


