News August 16, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638 టన్నుల యూరియా

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2,638.44 టన్నుల యూరియా గూడ్స్ వ్యాగన్ల ద్వారా చేరుకుంది. చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్ వద్దకు వచ్చిన యూరియాను ఖమ్మం జిల్లాకు 1,538.44 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,000 టన్నులు, సీఆర్పీ ఖమ్మంకు 100 టన్నులు చొప్పున బదిలీ చేసినట్లు రేక్ పాయింట్ టెక్నికల్ అధికారి పవన్‌కుమార్ తెలిపారు. ఈ యూరియాను రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
Similar News
News August 16, 2025
భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు కింది విధంగా ఉన్నాయి. మహదేవపూర్ 36.2, పలిమెల 91.6, మహాముత్తారం 105.8, కాటారం 36.2, మల్హర్ రావు 55.6, చిట్యాల 27.4, టేకుమట్ల 29.2 మొగుళ్లపల్లి 29.0, రేగొండ 52, ఘన్‌పూర్ 62.4, భూపాలపల్లి 97.2 కాగా.. జిల్లా మొత్తం 622.6 మి.మీ, జిల్లా యావరేజీ 56.6 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.
News August 16, 2025
కురుపాం: ఆంగార కాయలకు భలే గిరాకీ..!

కురుపాం ఏజెన్సీ ప్రాంతంలోని ముఠా గ్రామాల్లో వర్షాకాలంలో పండే ఆంగార కాయలకు మంచి గిరాకీ ఉంది. ఏడాదికి ఒక సారి పండే అంగార కాయలు నాణ్యత, పరిమాణం బట్టి కిలో ధర రూ.160 నుంచి 210 పలుకుతోందని గిరిజనలు తెలిపారు. ఆంగాక కాయల కూరలతో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. వీటిని దళారులు కొండపై గ్రామాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు కొని మైదాన ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముతున్నారని వారు వాపోయారు.
News August 16, 2025
ఈ ఏడాది 13,260 మందిపై కేసులు: VZM SP

ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.