News January 11, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.
Similar News
News February 8, 2026
కీలక కేసుల ఎవిడెన్స్ సురక్షితమే: ఫోరెన్సిక్ డైరెక్టర్

TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ <<19076008>>అగ్నిప్రమాదం<<>>పై డైరెక్టర్ శిఖా గోయెల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఉద్యోగుల అప్రమత్తతతో ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా కేసులకు సంబంధించి ప్రాపర్టీ, FSLకు చెందిన సామాగ్రి సురక్షితంగానే ఉందని పేర్కొన్నారు. ఘటనకు కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని, తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
News February 8, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ
> జనగామ అభివృద్ధి నా బాధ్యతనే: పొంగులేటి
> రేపు స్టేషన్ ఘన్పూర్ కు ఎంపీ ఈటెల రాజేందర్
> జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన తీన్మార్ మల్లన్న
> కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్
> కాంగ్రెస్ హామీల అమలులో విఫలం అయింది: తీన్మార్ మల్లన్న
> జనగామను వీడిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్
> పాలకుర్తి: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
News February 8, 2026
HYD: OYOలో ట్రాన్స్‌జెండర్లతో వ్యభిచారం

అసాంఘిక కార్యకలాపాలపై మల్కాజిగిరి పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా OYO హోటల్ నిర్వాహకులు కొత్త దందాకు తెరలేపి పోలీసులకు చిక్కారు. చైతన్యపురి పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి OYO అనుబంధ లాడ్జిలో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు లాడ్జిని సీజ్ చేసినట్లు SHO సైదులు తెలిపారు.


