News December 24, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆}దమ్మపేట: పాఠశాల ఎదుట ఆందోళన∆} బయ్యారం: ధాన్యం కొనుగోలు సందర్శించిన ఎమ్మెల్యే∆} చర్ల: ఇన్ఫార్మర్ నెపంతో యువకుడి దారుణ హత్య ∆}భద్రాద్రి జిల్లా: బాలికపై లైంగిక దాడి.. ఫోక్సో కేసు నమోదు∆}ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్∆}ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి∆} భద్రాచలం:అర్హులైన పేదలకు ఇందిరమ్మ:MLA∆} ఖమ్మం:’అంగన్వాడీలకు పెండింగ్ ఇంటి అద్దెలు ఇవ్వాలి’

Similar News

News February 10, 2026

ఖమ్మం: విద్యుత్ శాఖలో మహిళా రక్షణకు కమిటీ

image

ఖమ్మం: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణకు(POSH చట్టం) ఖమ్మం విద్యుత్ సర్కిల్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఈ శ్రీనివాసాచారి మహిళా ఉద్యోగులతో సమావేశమై, ఛైర్‌పర్సన్ రజని కుమారి నేతృత్వంలోని కమిటీ వివరాలను వెల్లడించారు. వేధింపులపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని భరోసా ఇచ్చారు. సురక్షిత పని వాతావరణమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

News February 10, 2026

వైరా: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ నిఘా

image

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 10, 2026

నిబంధనల మేరకే విధులకు హాజరు కావాలి: సీపీ

image

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.