News September 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాచలం రామాలయం వద్ద కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
∆} నేలకొండపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

Similar News

News October 2, 2024

ఖమ్మం: డీఎస్సీ అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఖమ్మం నగరంలో డీఎస్పీ-2024 అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. రిక్క బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రోటరీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

News October 1, 2024

KMM: దసరా పండుగకు 724 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC సుమారుగా 724 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపబడునని తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం 13, 14 తేదీలలో ఖమ్మం – హైదరాబాద్‌కు నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు అదనంగా 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

News October 1, 2024

ఖమ్మం: ‘గంజాయి అమ్మిన కొన్నా కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.