News February 13, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫాస్ట్ రిజల్ట్స్‌కు Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News February 13, 2026

BREAKING: కామారెడ్డిలో హంగ్.. కింగ్ మేకర్ BRS

image

కామారెడ్డి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మున్సిపాలిటీలోని మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇండిపెండెంట్ 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. మ్యాజిక్ ఫిగర్ 25 సంఖ్య ఏ పార్టీకి రాలేదు. దీంతో 11 స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్‌గా మారనుంది. వారు మద్దతు ఇస్తేనే ఛైర్మన్ ఎన్నికకు అవకాశాలు ఉన్నాయి.

News February 13, 2026

ఆటిజం‌కు చికిత్స ఇదే..

image

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని ఆటిజం అంటారు. దీనికి చికిత్స లేదు కానీ చిన్న వయసునుంచే కొన్ని పద్ధతులు పాటించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ ఉంటాయి. వీటితో పాటు తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 13, 2026

ఇంద్రకీలాద్రిపై శివరాత్రి శోభ

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసే ‘వధూవరుల అలంకరణ’ వేడుక శాస్త్రోక్తంగా, కన్నుల పండువగా జరిగింది. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ గాంధీ, ఈఓ శీనా నాయక్ ఈ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.