News December 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా జూలూరుపాడు, కూసుమంచి మండలాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.
Similar News
News March 6, 2026
వీధి కుక్కల బెడదకు ప్రత్యేక కార్యక్రమాలు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయి, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అటు ప్రధాన సమస్య అయిన వీధి కుక్కల బెడద తొలగించేందుకు MAR 14న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
News March 6, 2026
ఖమ్మం జిల్లాలో 99 డేస్ యాక్షన్ ప్లాన్ షెడ్యూల్

☆ MAR 6 నుంచి MAR 15 వరకు పారిశుద్ధ్యం, ఫైల్స్ క్లీయరెన్స్
☆ APR 6 నుంచి APL 11 వరకు వైద్య శాఖ
☆ APR13- 18 వరకు రోడ్ సేఫ్టీ
☆ APR 20-26 వరకు SC, ST, BC, మైనారిటీ సంక్షేమం, హౌసింగ్
☆ APR 27 నుంచి MAY 2 వరకు చైల్డ్ సేఫ్టీ, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు
☆ మే 4-10 వరకు అగ్రికల్చర్
☆ మే 11-16 వరకు విద్య
☆ మే 18-23 వరకు క్రీడలు
☆ మే 25-30 వరకు మహిళా సంక్షేమం
☆ జూన్ 1-12 వరకు పర్యావరణం
News March 6, 2026
99 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలి: వాకిటి

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని ఉమ్మడి ఖమ్మం ఇన్‌ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆర్థికస్థితిగతులు సహకరించక పోయినా పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషిచేయాలని శుక్రవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలని పేర్కొన్నారు.


