News December 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులు Dy.CM పర్యటన

image

Dy.CM మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మంలో జరిగే నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధిరలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటనలో వివరించారు.

Similar News

News April 5, 2026

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు తల్లీ, కుమార్తె మృతి

image

శ్రీకాకుళం జిల్లా మందసలోని పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణవేణి(35), కుమార్తె చిన్ని(15) కలిసి జీడీ తోటలో పనులు చేస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో పిడుగు వారు పనిచేస్తున్న తోటలో అకస్మాత్తుగా పడగా అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 5, 2026

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

image

సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీని క్రమబద్ధీకరించేందుకు అధికారులు రూ. 500 టికెట్లు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. ఈవో శీనానాయక్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News April 5, 2026

హార్ముజ్‌ను తెరవండి.. లేదంటే నరకానికి పంపిస్తా: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే వచ్చే మంగళవారం పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘జలసంధిని తెరవండి పిచ్చి బా*ర్డ్స్. లేదంటే నరకానికి పంపిస్తా. అల్లాను ప్రార్థించండి’ అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను ఓపెన్ చేయకపోతే <<19568118>>ప్రళయం<<>> సృష్టిస్తామని నిన్న ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే.