News December 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులు Dy.CM పర్యటన

Dy.CM మల్లు భట్టి విక్రమార్క 2 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా సోమవారం ఖమ్మంలో జరిగే నూతన డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధిరలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటనలో వివరించారు.
Similar News
News April 13, 2026
NZB: ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: CP

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని NZB పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్‌లో భాగంగా సోమవారం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.
News April 13, 2026
NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 124 ఫిర్యాదులు

నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు.
News April 13, 2026
NZB: పేద కుటుంబాలకు CMRF ఎంతో ఉపయోగకరం: షబ్బీర్ అలీ

అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో R&B గెస్ట్ హౌస్‌లో TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ విధానమన్నారు.


