News September 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

Similar News

News February 11, 2026

ఖమ్మం: పందిళ్లపల్లికి 1,334 టన్నుల యూరియా

image

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు మంగళవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను ఖమ్మం (634 టన్నులు), భద్రాద్రి కొత్తగూడెం (200), మహబూబాబాద్ (400) జిల్లాలకు కేటాయించారు. సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News February 11, 2026

నేడు ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు

image

KMM జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో 116వార్డుల్లో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు 414మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,41,875 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో మహిళలు 74,083 మంది, పురుషులు 67,768 మందితో పాటు ఇతరులు 24 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో మంగళవారం సాయంత్రానికి కేటాయించిన కేంద్రాలకు చేరారు.

News February 10, 2026

ఖమ్మం: విద్యుత్ శాఖలో మహిళా రక్షణకు కమిటీ

image

ఖమ్మం: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నివారణకు(POSH చట్టం) ఖమ్మం విద్యుత్ సర్కిల్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఈ శ్రీనివాసాచారి మహిళా ఉద్యోగులతో సమావేశమై, ఛైర్‌పర్సన్ రజని కుమారి నేతృత్వంలోని కమిటీ వివరాలను వెల్లడించారు. వేధింపులపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని భరోసా ఇచ్చారు. సురక్షిత పని వాతావరణమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.