News October 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ☆ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన BJP ఎంపీ ఈటెల☆ కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల తనయుడు☆ కుటీర పరిశ్రమతో ఉపాధి కల్పించడం సంతోషకరం: ITDA PO☆ జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి, కొమరం బీమ్ వర్ధంతి కార్యక్రమం☆ ఖమ్మం మున్నేరు పాత వంతెన పై రాకపోకలు దారి మళ్లింపు☆ బయ్యారంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

Similar News

News December 30, 2025

GOOD NEWS చెప్పిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చేవరకు పాత పద్ధతిలోనే ఎరువుల సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

News December 30, 2025

ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై బ్యాంకర్లు దృష్టి సారించాలి: అ. కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల విజయవంతానికి బ్యాంకర్లు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో మాట్లాడారు. రెండో త్రైమాసికం ముగిసే నాటికి జిల్లాలో ప్రాధాన్యత రంగం కింద నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యంలో 54.15 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు.

News December 30, 2025

ఖమ్మం: తగ్గిన నేరాలు.. బాధితులకు రూ.7 కోట్లు వాపస్!

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు భారీగా తగ్గాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల సమష్టి కృషితో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కట్టడి అయ్యాయన్నారు. ఇప్పటివరకు రూ.2.45 కోట్ల చోరీ సొత్తును రికవరీ చేశామన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న రూ.4.5 కోట్లను బాధితుల ఖాతాల్లో జమ చేయించామని, మరో రూ.1.5 కోట్లు హోల్డ్ చేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.