News September 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

☆ నేడు వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరా
☆ ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
☆ అశ్వారావుపేట నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో నేడు మోస్తారు వర్షాలు
☆ భద్రాద్రి రామాలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ అన్నపురెడ్డిపల్లిలో నేడు జోనల్ స్థాయి క్రీడా పోటీలు
☆ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న బిజెపి, కాంగ్రెస్ సభ్యత్వ నమోదు
☆ ఖమ్మం జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్ పర్యటన
Similar News
News March 2, 2026
ఖమ్మం: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం నిధుల విడుదలకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటనలు వచ్చినా, క్షేత్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News March 2, 2026
ఖమ్మం: నిర్లక్ష్యం వీడకుంటే ఉద్వాసనే

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు నెలల్లో 70 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిని టర్మినేట్ చేశారు.(ECR) అమలు, ఎఫ్ఆర్ఎస్ హాజరుపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని డీఈఓ చైతన్య జైనీ హెచ్చరించారు.
News March 2, 2026
తల్లాడ: ఈ స్టూడెంట్ బ్రిలియంట్

రంగం బంజరకు చెందిన ధర్మసోత్ మోక్షిత్ నాయక్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్‌లో నాలుగు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి నేషనల్ టాపర్‌గా నిలిచాడు. 50 మార్కులకు గాను 47 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గిరిజన విద్యార్థి సాధించిన ఈ ఘనతపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మోక్షిత్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.


