News October 24, 2025
ఉమ్మడి గుంటూరుకు భారీ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం వరకు అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని, సోమ, మంగళవారల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు గుంటూరు, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News October 24, 2025
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు ఉన్నారు.
News October 24, 2025
IGMCRIలో 226 నర్సు పోస్టులు

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. <
News October 24, 2025
డెత్ జర్నీ.. ఎప్పుడు ఏం జరిగింది?

☞ రా.10.30కి HYD-BLR బయలుదేరిన బస్సు
☞ బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు
☞ తెల్లవారుజామున 3-3:10 మధ్య కర్నూలు వద్ద బస్సు-బైక్ ఢీ
☞ ఇంధనం లీక్ అయ్యి చెలరేగిన మంటలు
☞ 19 మంది సజీవ దహనం, 21 మంది సురక్షితం
☞ రాష్ట్రపతి ముర్ము, పీఎం మోదీ, తెలుగు సీఎంల దిగ్భ్రాంతి
☞ PMNRF నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
☞ బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు శంకర్ మృతి
☞ క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స


