News February 14, 2025

‘ఉమ్మడి గుంటూరులో దడపుట్టిస్తున్న జీబీఎస్’

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు గిలియన్ బార్ సిండ్రోమ్ (GBS) కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జీజీహెచ్‌లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రాలోని పూణేలో 172 జీబీఎస్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. శ్రీకాళంలో పదేళ్ళ బాలుడు మృతి చెందినప్పటి నుంచి ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఊపిరి అందకపోవడం, గొంతు మింగుడు పడకపోవడం, చేతులు, కాళ్ళు చచ్చుపడటం జీబీఎస్ ప్రధాన లక్షణాలు.

Similar News

News March 12, 2025

గుంటూరు జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

గుంటూరు మిర్చి ఘాటున్నా.. రేటు లేదు !

image

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చియార్డులో మిర్చి ఘాటైతే ఎక్కువగా ఉంది కానీ రేటు మాత్రం లేదు. రైతులు ఆరుగాలం శ్రమించినా సరైన గిట్టుబాటుధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. గత సీజన్‌లో రూ.25.వేలు పలికిన క్వింటా ఈ ఏడాది రూ.11వేలకు కూడా పలకనంటొంది. కేంద్రం రూ.11,781 చెల్లిస్తామని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చెప్పినప్పటికీ రైతులు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. రైతులు క్వింటాకి రూ.20వేలు ఆశిస్తున్నారు.

News March 12, 2025

గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ సూచనలు

image

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్చరించారు. సచివాలయాలకు వచ్చే ప్రజలను గౌరవించి మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సచివాలయంలో ఇచ్చే అప్లికేషన్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, గుర్తులు ఉన్నవి వాడటానికి వీలులేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!