News April 3, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు

image

గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గురువారం రాత్రికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్‌ ప్రకటనలో తెలిపాడు. అలాగే, జిల్లా పక్కనే ఉండే పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Similar News

News April 4, 2025

బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2025

అమరావతికి మోదీ రాక.. ఏర్పాట్లు షురూ 

image

అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో తుళ్లూరు DSP మురళీకృష్ణ, MRO సుజాత, సీఐలు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

News April 3, 2025

11వ తేదీలోగా అభ్యంతరాలు తెలపండి: డీఈవో 

image

అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్‌లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు. 

error: Content is protected !!