News October 22, 2025

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల జాబితా.!

image

అమరావతి-అమరేశ్వరస్వామి దేవాలయం.
కోటప్పకొండ-శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం.
పెదకాకాని-శ్రీ మల్లేశ్వరస్వామి.
బాపట్ల-సోమనాథేశ్వరస్వామి ఆలయం.
చీరాల-శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం.
మాచర్ల-కాళహస్తేశ్వరస్వామి.
గురజాల-వీరేశ్వరస్వామి.
సత్తెనపల్లి-పాండురంగేశ్వరస్వామి.
చేబ్రోలు-చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి.
గోవాడ-శ్రీ బాల కోటేశ్వరస్వామి.
చిలుమూరు-శ్రీ రామ లింగేశ్వరస్వామి ఆలయం.
గుంటూరు-సాంబశివాలయం.

Similar News

News October 22, 2025

యూడైస్‌లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!

image

TG: యూడైస్‌(యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫమేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నిబంధన ఇంటర్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో పేరు నమోదు తప్పనిసరని, అలా ఉంటేనే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. యూడైస్‌లో పేరు లేకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు వీలు ఉండదు. ఇప్పటివరకు 75% విద్యార్థుల పేర్లు నమోదవ్వగా మరో 25% పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్ తప్పుల సవరణ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.

News October 22, 2025

కరీంనగర్: రేపే లాస్ట్ డేట్.. 27న డ్రా

image

కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అని, రూ.3 లక్షల రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస రావు తెలిపారు. నిన్నటి వరకు 2,639 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు అప్లికేషన్స్ సమర్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్‌లను ఈనెల 27న నిర్వహించే లాటరీ ద్వారా దక్కించుకోవాలని సూచించారు.

News October 22, 2025

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ప్రజలెవరూ బయటికి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.