News May 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు టాప్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. వేమూరులో అత్యధికంగా 85.02% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా గుంటూరు వెస్ట్‌లో 66.24% మంది ఓటేశారు. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News December 18, 2025

GNT: ఈ సీజన్‌కి అయినా యార్డ్ ఛైర్మన్ పోస్ట్ భర్తీ అయ్యేనా?

image

గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ విషయంలో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల నుంచి ప్రారంభమవనున్న మిర్చి సీజన్లో యార్డులో కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఛైర్మన్ పదవిని భర్తీ చేయకపోవడంతో సొంత పార్టీ నాయకులే నైరాశ్యంలో ఉన్నారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆశావహులు మాత్రం ఈ సీజన్‌కి పదవి భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు.

News December 18, 2025

ANU: బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. II, IV 4వ సెమిస్టర్, lll, lV 6వ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్
https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.

News December 18, 2025

GNT: 7,000 పైగా పాటలు పాడిన గొప్ప గాయకుడు

image

తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) ఉమ్మడి గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో జన్మించారు. ప్రసిద్ధమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈయన మధురకంఠము నుంచి జాలువారినవే. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడారు.