News January 28, 2025
ఉమ్మడి గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 9వ తరగతి, TGSERIS అలుగునూరు COEలలో 9వ తరగతి,TGSERIS ఖమ్మం, పరిగి SOE లలో 8వ తరగతి,TGSERIS రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్స్ ఆర్ట్స్ స్కూల్‌లలో 6వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 01వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తెలిపారు.
Similar News
News July 7, 2025
నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల ఇటీవల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
News July 7, 2025
కడప జిల్లా ప్రజలకు గమనిక

కడప కలెక్టరేట్‌లో ఇవాళ గ్రీవెన్స్ డే జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సభా భవనంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ప్రజలు 08562-244437కు కాల్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు కోరారు.