News April 16, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News April 16, 2025
పార్వతీపురం: ‘చిన్నారుల పెరుగుదలపై దృష్టి సారించాలి’

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల బరువు, పెరుగుదల వయస్సు తగిన విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏ అంగన్వాడీ కేంద్రంలో అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చిన్నారుల బరువు, పెరుగుదల ఉండదో అందుకు సూపర్వైజర్‌లు బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.
News April 16, 2025
MDCL: ఈ ఆసుపత్రుల్లో టెలీ మెడిసిన్ సర్వీస్

MDCL జిల్లాలో టెలీ మెడిసిన్ సర్వీస్ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల లిస్ట్ విడుదలైంది. కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ, శ్రీరంగవరం, నారపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్ వీహెచ్సీలతో పాటు, మచ్చ బొల్లారం, సుభాష్ నగర్, పర్వతానగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ హంసపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం UPHCల్లో అందుబాటులో ఉంది.
News April 16, 2025
ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.