News July 27, 2024
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 9.37 లక్షల బీపీఎల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డు ఉన్నవారికే రూ.500కె గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7 లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. జిల్లాల వారీగా బీపీఎల్ గ్యాస్ కనెక్షన్ల వివరాలిలా..
మహబూబ్‌నగర్ – 2,40,693
నారాయణపేట – 1,40,217
నాగర్ కర్నూల్ – 2,38,954
వనపర్తి – 1,57,390
జోగులాంబ గద్వాల – 1,60,654.
Similar News
News February 10, 2026
MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. SAVE IT

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ థావుర్యనాయక్ తెలిపారు. డ్యూటీ చార్ట్ వేసి ఫోన్ నంబర్‌లను పోలింగ్ సెంటర్ల వద్ద అతికించామని, అంతరాయం ఏర్పడితే..
✒AE టౌన్-1: 87124 72160
✒AE టౌన్-2: 87124 72161
✒AE టౌన్-3: 87124 72162
✒ADE టౌన్: 87124 72156లకు ఫోన్ చేయాలన్నారు.
News February 10, 2026
MBNR: హీటర్ షాక్ కొట్టి యువకుడి మృతి

మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు జామ్ రవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. రవి జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో స్నానం చేయడానికి హీటర్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News February 10, 2026
MBNR: కుదిరితే రూ.500 లేదంటే రూ.2 వేలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 డివిజన్లు, 316 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా గెలవాలని పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ సిద్ధమయ్యారు. పోటీ ఎక్కువగాలేని వార్డుల్లో ఓటుకు రూ.500 వరకు పంచుతున్నట్లు తెలిసింది. త్రిముఖపోటీ ఉన్నచోట రూ.2 వేలు, ద్విముఖపోరు ఉన్నచోట్ల రూ.1500 చొప్పున ఓటుకు నోటు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే ఈ ప్రక్రియకు తెరలేపినట్లు సమాచారం.


