News June 14, 2024
ఉమ్మడి జిల్లాలో చల్లబడ్డ వాతావరణం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటాపూర్లో 33.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా ఉట్కూరులో 32.7, వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 32.4, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 31.8, గద్వాల జిల్లా అల్వాలపాడు 29.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News February 4, 2026
ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన: డీఈఓ

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమ అమలు తీరును డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, మాక్ టెస్ట్ ఫలితాలు, యాక్షన్ ప్లాన్ అమలును సమీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 4, 2026
పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
News February 4, 2026
దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జీనుగరాలకు చెందిన వెంకటేష్ యాదవ్ లోన్ కోసం ఓ డాక్యుమెంట్‌పై ఎమ్మార్వో దీపిక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు సంతకంపై బ్యాంకు అధికారులు ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


