News July 2, 2024
ఉమ్మడి జిల్లాలో జోరుగా ఫిల్టర్ ఇసుక దందా
ఉమ్మడి జిల్లాలో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. నాణ్యతను బట్టి ఒక్కో ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకు రూ.1.75 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంచనా. నెలకు సుమారు రూ.50 కోట్లకు పైగా ఈ వ్యాపారం సాగుతోంది. చెరువులు, కుంటల వద్ద మట్టిని, గుట్టలను తొలిచి వచ్చిన మట్టిని ఇసుకగా మారుస్తున్నారు. మైనింగ్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 10, 2024
GWL: అపోహలు వీడి పూర్తి సమాచారం ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి
కులగణనపై ప్రజలు అపోహలు విడనాడి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌తో మాట్లాడారు. కులగణనలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్త వహించే విధంగా చూడాలన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులను సర్వేలో భాగస్వాములు చేయాలన్నారు.
News November 10, 2024
MBNR:CM రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా!
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నేడు కురుమూర్తి దర్శనానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి రోడ్డు ద్వారా MBNR జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలోని కురుమూర్తి దేవాలయానికి చేరుకుంటారు. మ.12:10కు ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి మ.12.30కు కురుమూర్తి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.
News November 10, 2024
MBNR: అరుణాచలానికి ప్రత్యేక బస్సులు.. ఫోన్ చేయండి.!
పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు MBNR, NRPT, NGKL, SDNR డిపోల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఈనెల 13న ఆయా బస్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని, రిజర్వేషన్ల కోసం MBNR-99592 26286, NGKL-99592 26288, NRPT-99592 26293, SDNR-99592 26287లకు సంప్రదించాలన్నారు. MBNRలోని బస్టాండ్‌లో రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చన్నారు.