News July 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్లో 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా సిరిసినగండ్లలో 13.5 మి.మీ, నారాయణపేట జిల్లా బిజ్వార్‌లో 8.8 మి.మీ వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News January 17, 2025

నల్లమలలో ఘనంగా ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

image

శ్రీశైలం ఉత్తర ద్వారం, నల్లమల కొండల్లోని శైవ క్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి.

News January 17, 2025

MBNR: రెండు మ్యాచ్‌లో సంచలన విజయం.!

image

చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో సౌత్ జోన్ టోర్నీలో పాలమూరు యూనివర్సిటీ జట్టు శుక్రవారం నిర్వహించిన రెండు మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. 3వ మ్యాచ్ కలసలింగమ్ అకాడమీ ఆఫ్ రిసెర్స్& ఎడ్యుకేషనల్ యూనివర్సిటి‌పై 15 పరుగులతో, 4వ మ్యాచ్‌లో డా.MGR ఎడ్యుకేషనల్&రిసెర్చ్ ఇనిస్ట్యూట్(TN) పై 103 పరుగులతో ఘన విజయం సాధించి ఫ్రీ క్వార్టర్స్ ఫైనల్‌కు చేరింది. దీంతో పలువురు అభినందించారు. >>CONGRATULATIONS❤

News January 17, 2025

వనపర్తి: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్‌లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.