News April 12, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే…

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 40.9, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 40.8, మహబూబ్నగర్ జిల్లా వడ్డేమాన్ లో 40.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 4, 2026
మహబూబ్‌నగర్: రేపు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్!

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
News March 4, 2026
పాలమూరు:జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔ఘనంగా హోలీ వేడుకలు
✔తుమ్మన్‌పేటతో విడదీయలేని అనుబంధం: హీరో విజయ్ దేవరకొండ
✔జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు:SP
✔పాలమూరు: డ్రంక్ అండ్ డ్రైవ్.. 5 మంది డ్రైవర్లకు జైలు శిక్ష
✔జడ్చర్ల: మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. బాధ్యులపై సస్పెన్షన్ వేటు
✔పాలమూరు: రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు
✔శరవేగంగా మహబూబ్‌నగర్ – దేవరకద్ర రైల్వే పనులు
✔చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత
News March 3, 2026
జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


