News August 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> MHBD: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
> HNK: ఎస్బిఐ ఎటిఎంలో చోరీకి యత్నం
> WGL: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
> HNK: పేకాట కేంద్రంపై పోలీసుల దాడి
> WGL: అట్రాసిటీ కేసులో మహిళకు రిమాండ్
> MHBD: నిషేధిత ఉత్పత్తులపై పోలీసుల తనిఖీలు

Similar News

News September 30, 2024

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి: ఎంపీ కావ్య

image

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో కావ్య మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని లేకపోతే ప్రాణాంతకం అయి ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News September 30, 2024

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కావ్య

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజురితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

వరంగల్: ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన ఫిర్యాదుదారులు

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదులను సోమవారం కలెక్టర్ సత్య శారద స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 103 రాగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకి సంబంధించి భూ సంబంధిత సమస్యలపై 53, జిల్లా విద్యా శాఖ, GWMCకి 6, వ్యవసాయ శాఖకి 5 దరఖాస్తులు వచ్చాయని, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవన్నారు.