News September 22, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤MBNR: రేపు ఉమ్మడి జిల్లా అండర్-19 క్రికెట్ జట్టు ఎంపిక
❤పెబ్బేరు:ATM చోరీ..రూ.15లక్షలు మాయం
❤BRS 4 ముక్కలైంది:MBNR ఎమ్మెల్యే
❤NGKL:దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
❤నూతన పోలీస్ స్టేషన్లో పై ఫోకస్
❤పలుచోట్ల వర్షం
❤NGKL: పిడుగు పడి రైతు మృతి
❤నేటితో ముగిసిన ఓటరు జాబితా అభ్యంతరాలు
❤గ్రామ పంచాయతీ వర్కర్స్ పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి:IFTU

Similar News

News September 22, 2024

MBNR: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

image

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. కల్వకుర్తి పట్టణ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాహక్కు చట్టం, బాలల హక్కు చట్టం, ర్యాగింగ్ వంటి చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు.

News September 21, 2024

MBNR: UPDATE.. ఓటర్ల వివరాలు ఇలా.!

image

మహబూబ్ నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో 3,838 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఈనెల 28న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో కసరత్తులు చేపట్టారు. ఈ నెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయగా.. దాని ప్రకారం 5,16,062 మంది ఓటర్లు ఉన్నారు. 2,57,477 మంది పురుషులు, 2,58,578 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 1,101 మంది మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

News September 21, 2024

MBNR: బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే యెన్నం ఫైర్

image

BRSపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. BRS పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలుగా విడిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. PAC ఛైర్మన్ పదవికి నలుగురిలో అరెకపూడి ఎవరు నామినేషన్ వేయించారో చెప్పాలన్నారు. పీఏసీ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు గులాబీ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ అవ్వడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఫైర్ అయ్యారు.