News January 18, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔క్రికెట్:ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరిన PU జట్టు
✔బిజినేపల్లి:కల్లు సీసాలో పాము కలకలం
✔పంచాయతీ పోరు..బ్యాలెట్ పత్రాలు సిద్ధం
✔ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతున్న చలి
✔వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష.. పాల్గొన్న MLAలు,వైద్యాధికారులు
✔గద్వాల:గొర్రెలను ఢీకొట్టిన లారీ..2 గొర్రెలు మృతి
✔బడి బయటి విద్యార్థులకు గుర్తింపు సర్వే
✔బొంరాస్ పేట:రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
✔రేపు జవహర్ నవోదయ పరీక్ష
✔ఢిల్లీ పీఠం మాదే:DK అరుణ
Similar News
News February 16, 2026
MBNR: ఎవరూ అరెస్టు కాలేదు: ఎమ్మెల్యే

ఎవరూ అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు.
News February 16, 2026
పాలమూరు: నేడు ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఇదే!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.
News February 16, 2026
పాలమూరు మేయర్ పీఠానికి ఫుల్ డిమాండ్!

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠానికి తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ సతీమణి ప్రసన్న, పార్టీ సీనియర్ నేత సిరాజ్ ఖాద్రి సతీమణి హజీరాబేగం, ఏకగ్రీవంగా ఎంపికైన రమ శ్రీనివాసరాజు మేయర్ పీఠానికి పోటీపడుతున్నారు. మేయర్ ఎంపిక విషయంలో నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే అయినప్పటికీని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.


