News March 18, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔ముదిరాజులను BC-Aలో చేర్చాలి:ముదిరాజులు ✔జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ✔ఎంపీ డీకే అరుణ నివాసంలో పోలీసులు ✔పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్లు ✔సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు:NHPS ✔వట్టెం వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు ✔NGKL:SLBC D1,D2 ప్రదేశాలు గుర్తింపు:కలెక్టర్ ✔మద్దూర్:విద్యుత్తు తీగలు తాకి లారీ దగ్ధం          

Similar News

News March 18, 2025

NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

image

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News March 18, 2025

MBNR: 16 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులు: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున 16 గ్రామాలను ఎంపిక చేశామని అక్కడ వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయో నివేదిక పంపించాలని ఆమె ఆదేశించారు.

News March 18, 2025

MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.

error: Content is protected !!