News March 25, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✔MBNR: PUలో ఉగాది కవి సమ్మేళనం!
✔BRS హయాంలో రంజాన్ తోఫా ఇచ్చే వాళ్ళం: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
✔NGKL:SLBC ఘటన.. మరొకరు మృతి
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు!
✔GWL:Way2News Effect..అనాథలను రూ.4.15 లక్షలు అందజేత
✔పీయూ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
✔కరెంటు కోతలపై వనపర్తిలో రైతుల ధర్నా
✔NGKL:SLBC ఘటన..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం: కలెక్టర్

Similar News

News March 26, 2025

కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

image

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్‌రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్‌పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News March 26, 2025

MBNR: ఆర్టీసీ బస్టాండ్‌లో కంకర తేలిన సీసీ రోడ్డు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి కంకర తేలి, గొయ్యిలా ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులకు, ఆర్టీసీ బస్సు వాహనాదారులకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే రోడ్డు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News March 26, 2025

మహబూబ్‌నగర్: నేడు ఉద్యోగ మేళా

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్టు ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగ మేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని ఆమె వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30ఏళ్లలోపు యువత అర్హులని అన్నారు.

error: Content is protected !!