News March 26, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤MBNR: రేపు PUలో ఉగాది వేడుకలు
❤గద్వాల డిపో మేనేజర్‌కు సన్మానం
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చలివేంద్రం
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤నాగర్‌కర్నూల్‌లో క్షుద్ర పూజల కలకలం
❤మార్చి 31 వరకు పన్నులు చెల్లించండి:కలెక్టర్లు
❤ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్లు
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

Similar News

News February 21, 2026

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, రేపే చివరి తేదీ

image

జగిత్యాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. బ్యాంకింగ్, RRB, SSC తదితర పోటీ పరీక్షలకు ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నోట్‌బుక్స్, పాకెట్ మనీతో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 6303554770లో సంప్రదించవచ్చు.

News February 21, 2026

10% గ్లోబల్ టారిఫ్‌తో లాభమా? నష్టమా?

image

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్‌పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

News February 21, 2026

నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

image

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.