News March 28, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’
Similar News
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మహబూబ్‌నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
News March 31, 2025
MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..!

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు.