News April 9, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

✔వక్స్ బిల్లు.. ముస్లింల భారీ నిరసన ర్యాలీ✔గద్వాలలో గుర్తుతెలియని మృగం కలకలం✔ప్రతి గింజను కొనుగోలు చేయండి: కలెక్టర్లు✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ✔వచ్చే విద్యా సంవత్సరానికి ఏకరూప దుస్తులు సిద్ధం: డీఈవోలు✔గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM✔PUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ✔పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభం✔వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు.
Similar News
News April 17, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ మిర్చి గరిష్ట: 12,251, కనిష్ట:8009. తేజా తాలు గరిష్ట:5751, కనిష్ట: 4211పత్తి గరిష్టం : 7341,కనిష్టం: 5555. కందులు గరిష్టం: 6639, కనిష్టం: 6639, మక్కలు గరిష్టం : 2304, కనిష్టం:2000, బొబ్బర్లు గరిష్ట: 62236, కనీష్ట: 5089. ఈ విధంగా మార్కెట్లో ఉత్పత్తుల ధరలు ఉన్నాయి.
News April 17, 2025
KMM: ఆంబోతు మృతి.. ఆ ఊరంతా తల్లడిల్లింది.!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని తాళ్లపెంటకు చెందిన దేవుడి ఆంబోతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ ఊరంతా తల్లడిల్లింది. ఆ ఆంబోతును దేవుడి స్వరూపంగా భావిస్తూ గ్రామస్థులు ట్రాక్టర్‌పై వీధులలో మేళతాళాలు, కుంకుమ చల్లుతూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్దలతో సంప్రదాయబద్దంగా ఆంబోతుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళలు, పెద్దలు, గ్రామస్థులు పాల్గొని, కన్నీటి పర్యాంతమయ్యారు.
News April 17, 2025
బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్ హవా.. సీక్వెల్ ప్రకటన!

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో తన తొలి సినిమా ‘జాట్’తో ప్రేక్షకులను మెప్పించారు. సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ APR 10న విడుదలై ఇప్పటివరకు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనికి సీక్వెల్ ‘జాట్-2’ను ప్రకటించింది. ఈ మూవీనీ గోపీచందే తెరకెక్కించనున్నారు. అటు సన్నీడియోల్ దీనితో పాటు బోర్డర్-2, గదర్-3 లోనూ నటిస్తున్నారు.