News April 15, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లిలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 41.4, మహబూబ్నగర్ జిల్లా సల్కార్పేట్ లో 41.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 41.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 40.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News December 27, 2025

MBNR: కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి సమీపంలో జిల్లా కోర్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ భూమిపూజ చేశారు. పండితులు వేదమంత్రాలు పఠిస్తూ కార్యక్రమం నిర్వహించారు. వారితోపాటు జిల్లా సెషన్ న్యాయమూర్తి ప్రేమలత, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి తదితరులు పాల్గొన్నారు.

News December 27, 2025

MBNR:GET READY.. సాఫ్ట్ బాల్ జట్టు సిద్ధం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగే అండర్-19 SGF సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బయలుదేరింది. విజేతగా నిలవాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఆకాంక్షించారు. ఈనెల 28 వరకు పోటీలు జరగనున్నాయి. పీడీలు వేణుగోపాల్, సరిత, నాగరాజు, లక్ష్మీనారాయణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

News December 27, 2025

MBNR:CM ప్రకటన..1,683 GPలకు లబ్ది

image

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్లకే అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1,683 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.