News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News September 9, 2025

NLG: తుది ఓటరు జాబితా విడుదలకు కసరత్తు!

image

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను బుధవారం విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం 33 మండలాల్లో 33 జడ్పీటీసీ, 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు సూచించారు.

News September 9, 2025

NLG: పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు!

image

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పోషణ ట్రాకర్, NHTS యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్ యాప్లో లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్ సమస్యతో యాప్ లు మొరాయిస్తుండటంతో కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తుంది.

News September 9, 2025

NLG: జీపీఓలు వచ్చేశారు!

image

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పాలన అధికారులు ఎట్టకేలకు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను నియమించగా నల్గొండ జిల్లాకు 276 మందిని కేటాయించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశంలో అధికారులు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు.