News April 17, 2024
ఉమ్మడి జిల్లాలో భానుడి భగ భగలు

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.9 డిగ్రీలు నమోదైంది. వనపర్తి జిల్లా పానగల్లో 43.7, మహబూబ్నగర్ జిల్లా సల్కరిపేటలో 43.2, నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో 43.0, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News April 23, 2025
బీజేపీ నేత హత్యకు కుట్ర: MBNR ఎంపీ అరుణ

దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.
News April 23, 2025
MBNR: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ విజయేంద్రబోయి అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో వాగ్దేవి ప్రభంజనం

ఆరంభం నుంచి అదే సంచలనం ఏటేటా అదే ప్రభంజనం అది వాగ్దేవికే సొంతం అని కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫలితాలలో MPC- ఫస్టియర్ అమీనా 468 మార్కులు, BiPC ఫస్టియర్లో సంజన 436 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో నవనీత్ గౌడ్ 992, బైపీసీలో రబ్ ష 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.