News December 3, 2024
‘ఉమ్మడి జిల్లాలో మద్యం బంద్’
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 3వ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్.వి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల దృష్ట్యా మధ్య విక్రయిస్తే చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
Similar News
News December 26, 2024
తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరు గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి జాన్సీరాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.
News December 26, 2024
ప.గో: దిశ మార్చుకున్న అల్పపీడనం..వర్షాలు ఎక్కడంటే
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.
News December 26, 2024
ప.గో: సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లేది ఎలా..?
సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు ఛార్జీలు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి భీమవరం, తణుకు మీదుగా 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. ఏలూరు, భీమవరం, తణుకు ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా డిమాండ్ తగ్గలేదంటున్నారు.