News June 17, 2024
ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్ వాడకం!?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు పురపాలికల్లో నిషేధిత ప్లాస్టిక్ (సింగల్ యూజ్డ్) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటి వాడకం ఏటా రెట్టింపు అవుతోంది. పట్టణాల్లోంచి ప్రవహించే వాగులు, డ్రైనేజీల్లో వ్యర్థాల్ని అడ్డగోలుగా పారబోస్తున్నారు. ఇవి వర్షాకాలంలో ప్రవాహాలకు అడ్డుగా నిలిచి ముంపు బెడద తీవ్రమవుతోందని బాధిత ప్రాంతాల వాసులు గగ్గోలు పెడుతున్నారు.
Similar News
News January 9, 2026
యూరియా కోసం రైతుల పాట్లు.. అధికారుల ప్రకటనలకే పరిమితం!

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో పంట పనులు వదులుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో నిర్లక్ష్యం వీడి, తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.
News January 9, 2026
మున్సిపల్ పోరు.. అందరి దృష్టి మంత్రి పొంగులేటి ఇలాఖాపైనే..!

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్‌లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.
News January 9, 2026
46 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు: డీఈవో

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.


