News September 18, 2024
ఉమ్మడి జిల్లాలో రేపు రెండు అన్న కాంటీన్లు ప్రారంభం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్న కాంటీన్లను గురువారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జీజే కళాశాల పక్కన.. అలాగే బొబ్బిలిలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అన్న కాంటీన్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News October 2, 2025
మహానీయుల ఆశయ సాధనకు కృషి చేయండి: VZM కలెక్టర్

నేటి తరానికి స్పూర్తి ప్రదాతలు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి అని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం విజయనగరం కలక్టరేట్ ఆడిటోరియంలో జాతి పిత మహత్మ గాంధీ, మాజి ప్రదాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆశయాల సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
News October 2, 2025
గోవిందపురం: రేబిస్ లక్షణాలతో మృతి

సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. లింగంనాయుడికి ఆగస్టు 30న వీధి కుక్క కరిచింది. దీంతో PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కాగా.. రాబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగంనాయుడు కొద్ది రోజుల్లో సింగపూర్ వెళ్లబోతున్న తరుణంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
News October 2, 2025
జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి: VZM కలెక్టర్

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆ ఇద్దరు మహనీయులకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొనాలని ఆదేశించారు.