News November 5, 2024
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య ఇదే..

ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఓటర్లు మొత్తం 727మంది ఉన్నారు. వీరిలో పార్వతీపురం జిల్లాలో 325 మంది ఉండగా, ఇందులో పురుషులు 132, మహిళలు 193 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 239 మంది మహిళా ఓటర్లు, 163 పురుష ఓటర్లు ఉన్నారు. రాజకీయ పార్టీలు ముసాయిదా జాబితాపై తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 8వ తేదీ లోగా తెలియజేయవచ్చు.
Similar News
News February 1, 2026
విజయనగరం: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలం వన్నలిలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు రానున్నారని సమాచారంతో ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్ ప్రమీలగాంధీ శనివారం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామంలో రీసర్వే బాగుండడంతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారన్నారు. తహశీల్దార్ కృష్ణలత పాల్గొన్నారు.
News February 1, 2026
విజయనగరం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో పురుగులమందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో చోటు చేసుకుంది. ఎన్.లక్ష్మణరావు నిత్యం మద్యం తాగడంతో భార్య రామలక్ష్మి గతనెల 30న మండలించారు. దీంతో పురుగులమందు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ కొండలరావు తెలిపారు.
News February 1, 2026
VZM: వ్యవసాయ అధికారుల డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం ప్రచురించిన 2026 డైరీని, పోస్టర్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తమ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులకు తమ విధి నిర్వహణలో ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విజయనగరం యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కె .ప్రకాష్ పాల్గొన్నారు.


