News March 24, 2024
ఉమ్మడి జిల్లాలో 91,357 ఎకరాల్లో ఎండిన పంటలు

ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. మొత్తం 8,04,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 5,34,150 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరందక సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం 91,357 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 11, 2026
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News February 11, 2026
MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News February 10, 2026
MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. SAVE IT

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ థావుర్యనాయక్ తెలిపారు. డ్యూటీ చార్ట్ వేసి ఫోన్ నంబర్‌లను పోలింగ్ సెంటర్ల వద్ద అతికించామని, అంతరాయం ఏర్పడితే..
✒AE టౌన్-1: 87124 72160
✒AE టౌన్-2: 87124 72161
✒AE టౌన్-3: 87124 72162
✒ADE టౌన్: 87124 72156లకు ఫోన్ చేయాలన్నారు.


