News April 20, 2024
ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’
> సివిల్స్ టాపర్ అనన్య రెడ్డికి సత్కరించిన CM రేవంత్ రెడ్డి > BJP ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు: DK అరుణ > 22 నుంచి ‘ప్రజల వద్దకు పోలీస్’ ప్రారంభం: ఎస్పీ > NGKL: CM రేవంత్ సభ (ఈనెల 23) ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు > ఉమ్మడి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు > NRPT: తనిఖీల్లో 25.32 లీటర్ల మద్యం పట్టివేత > ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు ఇవ్వాలి: AIPKMS
Similar News
News November 5, 2024
11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి
పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.
News November 5, 2024
అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత
జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.
News November 5, 2024
NRPT: చిరుతపులి దాడిలో మేకలు మృతి !
నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామ శివారులో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయని బాధితులు పేర్కొన్నారు. వెంకటప్ప తన మేకలను మేత కోసం సోమవారం అడవికి తీసుకెళ్ళారు. వాటిలో రెండు కనిపించకపోవడం మంగళవారం అడవిలో వెతకగా రెండు మేకలు మృతి చెంది కనిపించాయి. చిరుతపులి చేసిన దాడిలో మృతి చెందాయని బాధితుడు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే చిరుత సంచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.