News March 27, 2024
ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS’
✏NRPT:ACBకి పట్టుబడ్డ గుండుమాల్ తహశీల్దార్ పాండు
✏హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలం:డీకే అరుణ
✏సర్వం సిద్ధం.. రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక!
✏WNPT:శ్రీరంగపురం టెంపుల్‌లో హీరో సిద్దార్థ్ పెళ్లి
✏WNPT:’యాప్‌లో రూ.1,75,000 స్వాహా’
✏ఆయా జిల్లాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు
✏రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలలో గెలుస్తాం:వంశీచంద్ రెడ్డి
✏ఉమ్మడి జిల్లాలో హీరో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
Similar News
News January 11, 2025
MBNR: మాదకద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ జానకి
మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు. బాలానగర్ మండల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించారు. పోలీసు సేవలపై అభిప్రాయాన్ని కోరుతూ.. క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాలికలు, మహిళలపై జరిగే వేధింపులు, సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపాజీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 11, 2025
MBNR: స్కాలర్‌షిప్ రాక.. విద్యార్థుల ఇబ్బందులు.!
సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులు కోరుతున్నారు. స్కాలర్‌షిప్ రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్ షిప్‌ను చెల్లించాలని కోరారు.
News January 10, 2025
నేటి నుంచి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్
మహబూబ్ నగర్ పట్టణంలోని DSA స్టేడియం గ్రౌండ్‌లో నేటి నుంచి ఈ నెల 14 వరకు అండర్-17 హ్యాండ్ బాల్ జాతీయస్థాయి బాల, బాలికల ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SGF అధికారులు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 1550 మంది క్రీడాకారులు హాజరవుతుండగా.. బాలికలు-36, బాలురు-35 రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. ఉదయం,రాత్రి సమయాల్లో పోటీలు నిర్వహించనున్నారు.