News December 23, 2024
ఉమ్మడి జిల్లా జడ్పీటీసీల ఆత్మీయ సమావేశం
విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బుచ్చియపేట జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు, సీనియర్ జడ్పీటీసీ కర్రి సత్యం పాల్గొన్నారు. జడ్పీటీసీల ఫ్లోర్ లీడర్‌గా పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజును ఎన్నుకున్నామని రాంబాబు తెలిపారు.
Similar News
News December 23, 2024
విశాఖ: స్పా సెంటర్లో వ్యభిచారం
విశాఖ వీఐపీ రోడ్డులో Devinci థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు త్రీటౌన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ తిరుమలరావు ఆదివారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో మహిళలకు అధిక సొమ్ము ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నలుగురు బాధిత మహిళలను శక్తి సదన్ హోమ్‌కు పంపారు.
News December 22, 2024
సంధ్య థియేటర్ తొక్కిసిలాటపై పల్లా స్పందన
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాటపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. జన సమూహం ఎక్కువగా ఉన్న సమయంలో హీరో అల్లు అర్జున్ వెళ్లకుండా ఉంటే బాగుండేదని.. అయితే ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ ముందుగా గ్రహించి సమాచారం ఇవ్వాల్సి ఉందని అన్నారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మంచిది కాదని పల్లా అన్నారు. ఈ ఘటన కారణంగా బెనిఫిట్ షోలు ఆపేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
News December 22, 2024
విశాఖ జిల్లాలో హైటెక్ హరిదాసు
విశాఖ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. దీంతో హరిదాసులు, బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అయితే కాలానుగుణంగా హరిదాసులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు కాలినడకన తంబుర పట్టుకుని వీధివీధి తిరిగేవారు. అయితే మర్రిపాలెం గ్రామంలో టూవీలర్ల పై హరిదాసులు తిరుగుతూ సందడి చేస్తున్నారు. దీన్ని చూసిన పలువురు ఆనాటి కళకనిపించడం లేదని అంటున్నారు.