News July 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి కార్యక్రమాలు

image

@ ఉమ్మడి జిల్లాలో నేటి నుండి కొత్త చట్టాలు అమలు..
@ మక్తల్: ఉచిత కంటి వైద్య శిబిరం.
@ షాద్నగర్: నూతన బస్సులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే.
@ దామరగిద్ద, జడ్చర్లలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.
@ ఐజ సింగిల్ విండో సమావేశం.
@ మక్తల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
@ కొత్తకోటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహవిష్కరణ.
@ పెద్దకొత్తపల్లి: తైబజార్ వేలం

Similar News

News July 3, 2024

MBNR: నేటితో ముగియనున్న MPTCల పదవీ కాలం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి  జిల్లాలో మొత్తం 719 మంది MPTCలు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.

News July 3, 2024

బదిలీ అయినా SGTలకు తప్పని తిప్పలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,448 మంది ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సుమారు 2,413 మంది కొత్త స్థానాల్లో విధుల్లో చేరగా.. మరో 1,095 మంది ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాత స్థానాల్లోనే కొనసాగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, మారుమూల తండాలు, శివారు గ్రామాల్లో కొత్త ఉపాధ్యాయులు రాకపోవడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది.

News July 3, 2024

మాల్ ప్రాక్టీస్‌ విద్యార్థులు కమిటీ ముందు హాజరుకండి

image

ఇటీవల పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పరీక్షలలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి బుక్ అయిన విద్యార్థులు వ్యక్తిగతంగా మాల్ ప్రాక్టీస్ కమిటీ ఎదుట బుధవారం ఉదయం 11:30 గంటలకు హాజరుకావాలని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.palamuruuniversity.com సైట్‌ను సంప్రదించాలన్నారు.