News June 3, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా రాజోలిలో 147.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా బిజ్వారులో 97.5 మి.మీ, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో 84.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా దోనూర్లో 77.5 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 76.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదయింది.
Similar News
News February 6, 2026
MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.
News February 5, 2026
పాలమూరు: నేటి ముఖ్య వార్తలు

✒PU.. డిగ్రీ ఫలితాలు విడుదల
✒MBNR: మున్సిపల్ ఎన్నికల పీసీసీ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
✒పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి
✒PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి
✒పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ
✒మెట్టుగడ్డ మార్కెట్‌పై కాంగ్రెస్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒మున్సిపల్ ఎన్నికలు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం
News February 5, 2026
MBNR:PU.. ఫలితాలు విడుదల UPDATE!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనములో యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ డిగ్రీ 1వ సెమిస్టర్(30.08%), 3వ సెమిస్టర్ (39.72%), 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.


