News July 10, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలివే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో 25.5 మి.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 17.3 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్లో 13.8 మి.మీ, గద్వాల జిల్లా మల్లాపూర్ 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News February 14, 2026
పాలమూరు మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో..?

పాలమూరు మేయర్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ చదరంగం మొదలైంది. గెలిచిన కార్పొరేటర్లు పట్టణంలో కాకుండా క్యాంపుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో మేయర్ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ, ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన వారు తిరుగుబాటు చేస్తారనే భయంతో నేతలు మౌనం వహిస్తున్నారు. క్యాంపు రాజకీయాల నడుమ గ్రూపుల తలనొప్పి అధిష్ఠానానికి సవాల్‌గా మారింది.
News February 14, 2026
MBNR: ఈనెల 18న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 18న అమ్నీల్ ఫార్మా, ఆర్-సొల్యూషన్స్ సంస్థలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరగనుంది. 2025-26 బ్యాచ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎం.కామ్ విద్యార్థులు అసలు సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌తో ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియానికి రావాలని ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్ కుమార్ తెలిపారు. QC, QA, ప్రొడక్షన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి.
News February 14, 2026
పాలమూరు: జాతీయ చీఫ్ వచ్చినా.. ప్రభావం చూపని బీజేపీ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.


